శ్రీలీల క్లాసికల్‌ డ్యాన్స్‌

TRINETHRAM NEWS

శ్రీలీల పక్కన డ్యాన్స్‌ చేయడం అంటే తాట తెగిపోతుంది.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు.

అటువంటి డాన్సర్ శ్రీలీల క్లాసికల్‌ డ్యాన్స్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

ఇటీవల జరిగిన సమత కుంభ్‌-2024 వేడుకల్లో శ్రీలీల ఇచ్చిన ప్రదర్శన ఆహూతులను అలరించింది.

ఇప్పటివరకూ శ్రీలీలలో ఇంత టాలెంట్‌ ఉందనుకోలేదు కళ్లు చెదిరిపోయాయి వర్మ.. అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

గోదాదేవిగా ఆమె అభినయానికి వీక్షకులు ఫిదా అయిపోయారు.

అమెరికాలో పుట్టిన శ్రీలీల చిన్నప్పటినుంచే క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకున్న సంగతి తెలిసిందే…

You cannot copy content of this page

Scroll to Top