TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని దాసరి నెమలిపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 38వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన బి ఆర్. ఎస్, పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజి శాసన సభ్యులు రామావత్ రవీంద్ర కుమార్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి.
మంగళవారం డిండి మండలం దాసరి నెమలిపూర్ గ్రామంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దైవచింతన తో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని, ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఆయన అన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యు లు ఆయనను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజీనేని వెంకటేశ్వర్రావు, పిఎసిఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాసరావు, మాజీ కోఆప్షన్ సభ్యులు జాంగిర్, మాజీ సర్పంచ్ రామచంద్రం, గంగిడి నరేందర్ రెడ్డి, గంగిడి కొండల్ రెడ్డి, పసునూరి వెంకటయ్య, బొడ్డుపల్లి కృష్ణ, రామోజీ నరేష్, గండూరి లక్ష్మణ్, మాసూమ్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Srilakshmi Venkateswara Swamy Brahmotsavam