
ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకు నియోజవర్గం అరకువేలి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 6: దేవతలకే దైవంగా భావించబడే శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన శుభ ఆహ్వాన పత్రికను అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. అరకు నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు రేగం మత్స్య లింగం ఈ ఆవిష్కరణను స్వయంగా స్వామివారి సన్నిధిలో నిర్వహించారు. అరకు మండల కేంద్రంలో ఈ ప్రత్యేక కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మే 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఐదు రోజులపాటు జరగనున్న శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించేలా అంగరంగ వైభవంగా జరుగనున్నాయని తెలిపారు.ఈ మహోత్సవాల్లో పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రజానీకానికి, భక్త సమాజానికి ఆహ్వానం పలికారు.
ఈ కళ్యాణ మహోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, వర్తక సంఘాలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు: ఆలయ కమిటీ చైర్మన్ పి.దాసు బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ సివేరి బాలకృష్ణ,
అరకు సర్కిల్ పోలీసులు: సీఐ హిమగిరి , ఎస్సై గోపాలరావు, ఆలయ అర్చకులు గణేష్ పంతులు, రాజకీయ నాయకులు: వైసిపి మండల అధ్యక్షుడు రామ్మూర్తి, టిడిపి మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు, జనసేన ఇంచార్జ్ చిరంజీవి , ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు ఎంపీటీసీలు: దురియ ఆనంద్ , శత్రుగున్, భీమరాజు వైసిపి అధికార ప్రతినిధి (అల్లూరి జిల్లా) కోర్ర గాసి బీసీ సెల్ అరకు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింగరావు ఉత్సవ కమిటీ వైస్ ఛైర్మన్ పాంగి విజయ్. మోహన్ అలానే వివిధ సంఘాలు, గ్రామస్థాయి నాయకులు, భక్తులు కూడా పాల్గొన్నారు. కాపుగంటి కృష్ణారావు , అప్పల రామ్, సాంబయ్య , అప్పన్న , మోహన్, ఎల్బీ వెంకటేశ్వర్లు, రామారావు, జన్ని అర్జున్, కామేష్ , మహాదేవ్, సహదేవ్, ధర్మ, తదితరులు ఈ కార్యక్రమాన్ని గౌరవించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
