Road Accident : రహదారి సర్వీస్ రోడ్డు ప్రక్కన ఆగిప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : యడ్లపాడు మండల కేంద్రమైన వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు ప్రక్కన శుక్రవారం ఆగిప్రమాదం చోటుచేసుకొన్నది. దాదాపు పావు కిలోమీటర్ పొడవునా తగలబడుతూ మంటలు ఇళ్ళవద్దకు చేరుకోవడంతో ఇళ్ల వారు చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఈలోగా దట్టమైన పొగ, సెగలతో జాతీయ రహదారిపై ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందికి గురైనారు. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన టీమ్ లీడర్ ఎస్. వెంకయ్య , సిబ్బంది అగ్నిమాపక వాహనంతో ప్రమాదస్థలం వద్దకు వచ్చి మంటలను అదుపు చేశారు. దాంతో ప్రయాణీకులు సమీప ఇళ్ల వారు పెను ప్రమాదం తప్పిందని స్థిమిత పడ్డారు. గ్రామంలో లోని వారు వేసే చెత్త, తదితర పదార్ధాలతో నిండిపోయిన ఈ ప్రదేశంలో ఆకతాయిలు చేసిన పనిగా భావిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Accident on the side

You cannot copy content of this page

Scroll to Top