
వేడుకలకు హాజరుకానున్న కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్.
సాయంత్రం దేవాలయానికి రానున్న హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ
Sri Mahashakti Temple : త్రినేత్రం న్యూస్ : కరీంనగర్ లోని ముగ్గురు అమ్మవార్లు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతిల మహిమాన్విత దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది (తెలుగు నూతన సంవత్సరం) వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి దివ్య ఆశీస్సులతో ఉగాది మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గురువారం తెల్లవారుజామున 4:30 గంటలకు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకపూజ, విశేష అలంకరణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి ఆలయంలో ఉగాది పచ్చడిని అమ్మవారికి నివేదించి భక్తులకు ప్రసాదంగా అందించడానికి ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
అలాగే వేద పండితుల ఆధ్వర్యంలో కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ వివరములు, రాశి ఫలాలు తదితర విశేషాలను తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని గురువారం రోజున సాయంత్రం 6 గంటలకు ఆలయంలో నిర్వహించనున్నారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామితో పాటు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నారు. శ్రీ మహాశక్తి ఆలయంలో ఉగాది వేడుకలు ఎంతో వైభవంగా ఆధ్యాత్మికత శోభతో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుండడంతో దేవాలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్న దృశ్య, తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దేవాలయం వివిధ పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. శ్రీ మహాశక్తి దేవాలయంలో జరిగే ఉగాది పర్వదిన వేడుకలకు భక్తులు, హిందూ బంధువులు తరలివచ్చి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

