వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ లోని న్యూ గాంధీ గంజ్ లో శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయంలో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఆలయ ధర్మకర్త అర్ధ.సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండవ రోజు వివిధ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు పూజల్లో భాగంగా అవహిత దేవత పూజ, రుద్ర హోమం, బలి, పూర్ణహుతి,అనంతరం అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది అదేవిదంగా రేపు చివరిరోజు సహస్ర కళాశాభిషేకం, అలంకారం మరియు రేపటి పూజ కార్యక్రమనికి విశిష్ట అతిధిగా బ్రహ్మ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు అదేవిదంగా ముఖ్య అతిధిగా తెలంగాణ శాసనసభ సభాపతి శ్రీ. గడ్డం.
ప్రసాద్ కుమార్ అదేవిదంగా జిల్లాకు సంబందించిన శాసనసభ్యులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో రానున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలపడం జరిగింది ఈ మహోత్తర కార్యక్రమంలొ భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనవలసినదిగా సుధాకర్ రెడ్డి ఆహ్వానం తెలపడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


