వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా,నవాబ్ పేట మండలం,ఎల్లకొండ గ్రామంలోని శివ పార్వతుల దేవాలయంలో ఉన్న పురాతన జైన విగ్రహాలను పరిరక్షిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం ఎల్ల కొండశివాలయాన్ని కలెక్టర్ సందర్శించి శివ పార్వతుల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో ఉన్న వందల ఏళ్ల నాటి జైన విగ్రహాలను పరిశీలించిన అనంతరం గ్రామస్థులతో మాట్లాడుతూ..ఎంతో ప్రాముఖ్యత ఉన్న జైన విగ్రహాలు పూజకు నోచుకోకుండా ఉండిపోవడం బాధాకరమని అన్నారు. గ్రామంలో జైన మతస్థులు లేకపోవడం,ఆ విగ్రహాలకు పూజ విధానాలు జైన్ల పద్ధతి లో ఉంటాయన్నారు. అందువల్ల ఆ విగ్రహాల ప్రాముఖ్యతను అందరికి తెలిసేలా జైన మతస్థులు ఉన్న చోటికి లేదా హైద్రాబాద్ కు తరలిస్తే బాగుంటుందని, జైన మతస్థులు ఉండే చోట ఆ విగ్రహాలు ఉంటె వారి పద్ధతి ప్రకారం ప్రక్షాళన చేసి పూజలు నిర్వహిస్తారని, అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఇందుకు గ్రామ పెద్దలు స్పందిస్తూ అతి పురాతన దేవాలయము అయినందున విగ్రహాలను తరలించరాదని కలెక్టర్ ను కోరారు. చేవెళ్ళ శాసన సభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు జైన్ విగ్రహాల నిర్వహణకు కృషి చేయాలని కల్లెక్టర్ ను కోరారు. అనంతరము గ్రామ పరిసరాల్లో ఉన్న పురాతన దేవాలయాన్ని, మరియు ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్న జైన్ మతస్థుల విగ్రహాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమమలో ఏం పి డి ఓ అనురాధ , తహసిల్దార్ బుచ్చయ్య, ఆలయ చైర్మెన్ పటోళ్ళ భరత్ రెడ్డి, గ్రామ ప్రజలు, తదితరలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


