Sekhar Reddy : గ్రామ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి..

TRINETHRAM NEWS

తీదేడు గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ సహాకరించాలి.

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి.. తీదేడు గ్రామ సర్పంచ్

చింత పల్లి ఫిబ్రవరి 16 త్రినేత్రం న్యూస్. తీదేడు గ్రామ సభలో సూచించిన సమస్యలనే ఆధారంగా చేసుకొని పరిష్కార దిశగా మన గ్రామ ప్రయాణం కొనసాగుతుందని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.తీదేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా రోడ్ల సంక్షేమం అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నయని ఆమె
పెర్కోన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తామని ఆమె అన్నారు.ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధి అని ఆమె అన్నారు.గ్రామ ప్రజల భాగస్వామ్యమే మన గ్రామ బలము మన అభివృద్ధికి పునాది అన్నారు.గ్రామ అభివృద్ధి కోసం సహకరిస్తున్న ప్రతి ఒక్క గ్రామవాసికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్,గ్రామ పంచాయతీ కార్యదర్శి కార్యదర్శి అశోక్,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య, దాసరి కళమ్మ ముత్తయ్య,రెడ్డి పద్మ పరమేష్,సందె లక్ష్మయ్య,మర్ల యాదగిరి,శివర్ల పర్వతాలు యాదవ్,గ్రామ వైద్యాధికారి,అంగన్వాడి టీచర్లు,ఏ.యన్.యం,ఆశావర్కర్లు, విద్యుత్ సంబంధిత అధికారులు, గోపాల మిత్ర, ఉపాధి హామీ పీల్డ్ అసిస్టెంట్,వెలుగు,గ్రామ పంచాయతీ సిబ్బంది,గ్రామ పెద్దలు,గ్రామ యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Special focus on solving village problems

You cannot copy content of this page

Scroll to Top