వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సదరం కార్డు యుడిఐడి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
మంగళవారము కలెక్టరేట్ వి సి హాలు నందు జిల్లా గ్రామీణ అభివ్రుది అధికారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
సదరం ధ్రువీకరణ పత్రాల కోసం యుడిఐడి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ, విఎల్ఇ కేంద్రాలను ఆశ్రయించేవారని, ఇప్పుడు వీటితోపాటు యుడిఐడి పోర్టల్ , స్వంత మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ మరియు స్లాట్లు చేసుకోవచ్చని తెలిపారు. క్యాంపుల వివరాలు కూడా సందేశం మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.
21 రకాల వైకల్యం కలిగిన వారు యుడిఐడి యూనిక్ డిజాబ్లిటీ ఐడి కార్డును పొందవచ్చని తెలిపారు. సదరం కార్డును కూడా పోస్టల్ ద్వారా అభ్యర్థులకు చేరవేయడం జరుగుతుందని అన్నారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కలిగి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, దివ్యాంగులు ఎలాంటి అపోహలకు గురికాకుండా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
జిల్లా లో సదరం క్యాంప్ నిర్వహించే సందర్భాల్లో దివ్యాంగులకు అసౌకర్యం కలుగకుండా ర్యాంపు , త్రాగునీరు, టై లెట్స్ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశం లో డి ఆర్ డి ఓ శ్రీనివాస్, జిల్లా వైద్య అధికారి వెంకట రావణ, డి సి ఎచ్ ఎస్ ప్రదీప్, జిల్లా పంచాయతి అధికారి జయసుధ, సుపరింతెన్దేంట్ వినోద్, డి ఫై ఎం నర్సిములు, ఎ ఫై ఎం కమలాకర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


