TRINETHRAM NEWS

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొత్త రేషన్‌కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెల చివరి వారంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరించాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించింది. ప్రజాపాలనలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం… తాజాగా కొత్త రేషన్‌కార్డులకూ దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది.

అర్హులందరూ కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తుచేసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండడంతో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పకడ్బంధీగా నిర్వహించేలా పౌర సరఫరాల శాఖ కసరత్తులు చేస్తోంది. అభయహస్తంతో సంబంధం లేకుండానే.. రేషన్‌ కార్డుల అప్లికేషన్లను స్వీకరించాలని నిర్ణయించింది. అర్హులైన వారు తమ సమీప మీ సేవా కేంద్రాల్లోనే రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2.86 కోట్ల మందికి లబ్ధి పొందుతున్నారు. కాగా.. ఇటీ-వల స్వీకరించిన ప్రజా పాలనలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు రాగా.. అందులో అయిదు గ్యారెంటీ-లకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులుండగా.. కొత్త రేషన్‌ కార్డులు, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 వచ్చాయి.

ప్రజాపాలన కార్యక్రమంలోభాగంగా రేషన్‌ కార్డుల కోసం అ్లప చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం విశేషం. గతంలో మాదిరిగానే మీ సేవ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ద్వారా ప్రత్యేక సాప్ట్‌nవేర్‌ను రూపొందించినట్టు తెలిసింది. రాష్ట్రంలో చాలా మందికి రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రజాపాలనలో భాగంగా అయిదు గ్యారంటీల కోసం ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులను రేషన్‌కార్డు లేనివారు సమర్పించలేకపోయారు.

ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్‌కార్డు ప్రామాణికం కావడంతో కొత్త రేషన్‌కార్డులు త్వరగా జారీ చేయాలని ప్రజల నుంచి ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో కొత్త రేషన్‌కార్డులను యుద్ధ ప్రాతిపదికన జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ-ల అమలుకు రేషన్‌కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుండడంతో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియకు ప్రాధాన్యత ఏర్పడింది.