
Solar Boats : త్రినేత్రం న్యూస్ : అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి సర్కార్ పర్యాటక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుంది, ఈ క్రమంలో కృష్ణానదిలో పర్యాటకులకు మరింత ఆహ్లాద కరమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ కొత్త అడుగు వేయనుంది. డీజిల్ బోట్లకు ప్రత్యామ్నాయంగా సోలార్ శక్తితో నడిచే మెకనైజ్డ్ బోట్లను ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది.
ఈ మేరకు జరిగిన ఏపీటీడీసీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోగా.. సోలార్ బోటు నమూనాను కూడా సభ్యులకు ప్రదర్శించారు. ప్రయోగాత్మకంగా నాలుగు సోలార్ మెకనైజ్డ్ బోట్లను కొనుగోలు చేయాలని నిర్ణయిం చారు. విజయవాడ ప్రాంతంలో ఏడాది పొడవునా సూర్య కాంతి ఎక్కువగా లభించే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నాలుగు బోట్లను బెజవాడ డివిజన్‌కు కేటాయించనున్నారు.
ప్రస్తుతం కృష్ణానదిలో పర్యాటక సేవల కోసం డీజిల్‌తో నడిచే మెకనైజ్డ్ బోట్లు వినియోగంలో ఉన్నాయి. డీజిల్ ధరల పెరుగుదలతో నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతుండటంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తూ సోలార్ బోట్ల ను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీటీడీసీ నిర్ణయించింది.సాధారణ మెకనైజ్డ్ బోటు ధర సుమారు రూ. 30 లక్షలు కాగా.. సోలార్ మెకనైజ్డ్ బోటు ధర సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. నాలుగు బోట్ల కొనుగోలుకు దాదాపు రూ.2 కోట్ల వ్యయం అవుతుం దని అంచనా.
ఇందుకోసం టెండర్లు లేదా కొటేషన్లు ఆహ్వానించి, తక్కువ ధరకు నాణ్యమైన బోట్లను అందించే సంస్థకు కాంట్రాక్టు ఇవ్వనున్నారు. ఒకటి నుంచి రెండు నెలల్లో ఈ బోట్లు అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. సోలార్ బోట్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి డీజిల్ బోట్లతో పోలిస్తే శబ్దం తక్కువగా చేస్తాయి. దీంతో పర్యాటకులు కృష్ణా నది సహజసౌందర్యాన్ని ప్రశాంత వాతావరణంలో ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe