తేదీ : 22/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, పెదరాయుడు గూడెం గ్రామం, బూరుగువాయిలో స్థిర నివాసం కలిగి ఉన్నటువంటి ఆదివాసి ముద్దు బిడ్డ , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, కాబోయే మండల అధ్యక్షులు కుంజా. వెంకట నరసయ్య దొర కేంద్ర ప్రభుత్వం ప్రధాన మోదీ పేద మరియు అణగారిన వర్గాలకు పదకొండు సంవత్సరాల సేవ సుపరిపాలనలో అండగా ఉన్నారని ప్రజలకు చెప్పడం జరిగింది.
త్రాగునీటి కనెక్షన్లు పదిహేను కోట్లు, పైగా, ఉచిత ధాన్యం పంపిణీ పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారాఎనభై ఒకటి కోట్ల మందికి, అదేవిధంగా గత ప్రభుత్వం లో కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఇరవై కోట్ల మహిళలకు నగదు బదిలీలు, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ కు రాజ్యాంగం హోదా కల్పించారని, స్టాండ్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఎస్ సి, ఎస్ టి లకు కోట్లు పద్న్నాలుగువేల,ఏడు వందలు పైగా రుణాలు ఇచ్చారని, మరియు ఇళ్ళ నిర్మాణం నాలుగు కోట్ల పైగా, చిన్న వ్యాపారులకు రుణాలు ముద్ర యోజన పథకం ద్వారా రూపాయలు 52.5 కోట్లు పైగా ఇచ్చారని, స్వచ్ఛ భారత్ లో భాగంగా పన్నెండు కోట్ల మరుగుదొడ్లను దేశంలో నిర్మించడం జరిగింది.
అరవై ఎనిమిది లక్షల వీధి వ్యాపారులకు రుణాలు కూడా ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కుల, మత, పార్టీ, భాష బే దం లేకుండా రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామాలలో కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలు అందాయని అనడం జరిగింది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రజల్లో ఆనందం, వెలుగులు నిండుతున్నాయని, నిండాయని పేర్కొన్నారు. దీపంతో దీపం – టు పథకం కింద గ్యాస్ సిలిండర్లు, విద్యార్థులకు, తల్లికి వందనం, ఇల్లు కట్టుకునే వాళ్లకు ఉచిత ఇసుక, పింఛన్లు రూపాయలు నాలుగు వేలు, వికలాంగులకు ఏడు వేలు, మహిళా దర్జీలకు కుట్టు మిషన్లు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు అందించారని తెలియజేశారు.
త్వరలోనే ఆగస్టు పదిహేను వ తేదిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగ భృతిని కల్పిస్తున్నారని, అనడం జరిగింది. ఎంపీపీ స్కూల్ నుండి జూనియర్ కళాశాల వరకు ఉచితంగా విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు మరియు నోట్ బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్, బూట్లు ఇచ్చారని తెలిపారు. రైతులకు రైతు భరోసా కూడా ఇచ్చారని.
ప్రజలకు తెలియజేశారు. ఇంత అద్భుతంగా దేశంలో మోదీ పరిపాలన, రాష్ట్రంలో చంద్రన్న పరిపాలన జరుగుతుంటే గంగిరెద్దులాటలాడుకుంటూ వైసిపి వాళ్లు కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తే ఊరుకుంటారా? గత ప్రభుత్వంలో బూతుల పంచాంగం చెప్పిన వాళ్ళందరూ రెడ్ బుక్ ద్వారా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని అన్నారు. ఇప్పటికైనా పార్టీ పరంగా చూడకుండా ప్రజలకు సమస్య వస్తే పరిష్కరించే విధంగా చూస్తే ఏ పార్టీ నైనా ప్రజలు మెచ్చుకుంటారని అనడం జరిగింది. కుక్కునూరు మండలంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు , అదేవిధంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఏ మంచి పని చెయ్యడానికైనా సిద్ధంగా ఉండాలని,పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


