Snacks for Children : నీడ ఆధ్వర్యంలో చిన్నారులకు స్నాక్స్

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ కీ చెందిన దంపతులు రావి పద్మావతి రామ్మూర్తి నాయుడు ముద్దుల తనయుడు చిరంజీవి సిద్ధార్థ ప్రతిష్టాత్మకమైన ఐఐటి ఢిల్లీలో సీటు సాధించిన శుభ సందర్భంగా వారి ఆత్మీయ శ్రేయోభిలాషులు, నీడ దాతలు సముద్రాల వైజయంతి అప్పారావు దంపతులు శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆనందాన్ని గోదావరిఖని చంద్రబాబునాయుడు కాలనీలో ఉండే స్లమ్ ఏరియా పిల్లలకీ నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ చేతుల మీదిగా స్నాక్స్, స్వీట్స్, డ్రింక్స్ ఇచ్చి అ పుణ్య కార్యక్రమాన్ని బహుమతిగా చిరంజీవి సిద్ధార్థకు అందించారు.

ఈ సందర్బంగా నీడ రమేష్ మాట్లాడుతూ ఇలాంటి శుభ సందర్భాలను కుటుంబసభ్యులకే పరిమితం కాకుండా ఇలా నిరుపేదలతో జరుపుకోవడం వారి ఆనందన్ని ఇతరుల మొఖాలలో చూడటం గొప్ప విషయమని కొనియాడారు ఇలాంటి కార్యక్రమాలు పలువురికి గా ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఇతరులు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నీడ సభ్యులు రావుల శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Snacks for children under

You cannot copy content of this page

Scroll to Top