ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 18 at 10.22.27

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మార్చి 18
సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి.

హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనం లో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదేరోజు అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో తిరుగు ప్రయాణం అయ్యారు..

హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషా బాద్‌ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే.. కర్ణాటకకు చెందిన ఓ డీసీ ఎం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

You cannot copy content of this page