TRINETHRAM NEWS

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ

అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు తరలిరావాలని పిలుపు.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కొత్తగూడెంలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది*. ఈ సమావేశంలో సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఇప్పటికే అనేక సంవత్సరాలుగా అనేక పోరాటాలు సమ్మెలు నిర్వహించాం. గత ప్రభుత్వ కాలంలో ఒక్క పైసా వేతనం కాంట్రాక్ట్ కార్మికులకు పెంచలేదు. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచుతామని అధికారంలోకి వచ్చే నెల రోజుల్లో అమలు చేస్తామని హామీ కూడా ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినప్పటికీ నీ వేతనాలు పెంచలేదు. లాభాల్లో మాత్రం 5000 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చి అల్ప సంతోషాన్ని మాత్రమే ఇచ్చింది. సింగరేణిలో 20 సంవత్సరాల కు పైగా పనిచేస్తున్న లోడింగ్ అన్లోడింగ్ నర్సరీ సులభ లాంటి ఎన్నో విభాగాల కాంట్రాక్టు కార్మికులకు ఇప్పటికీ కనీస వేతనాలు వర్తించడం లేదు. వారిని సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులుగా యాజమాన్యం గుర్తించడం లేదు వారికి కనీస వేతనాలు సీఎం పిఎఫ్ బోనస్ లాంటి కనీస హక్కులను సైతం అమలు చేయడం లేదు. ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకసార్లు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (TUCI)
అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ గుమ్మడి నరసయ్య నేతృత్వంలో ప్రభుత్వానికి, మంత్రులకు ఎమ్మెల్యేలకు అనేకసార్లు వినతి పత్రం ఇచ్చాం. వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు పెంచుతామని అంటున్నావే తప్ప ఇంతవరకు వేతనాలు పెంచే చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (తుసి) ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా నవంబర్ 24 నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఎమ్మెల్యేలకు స్థానిక అధికారులకు స్థానిక జనరల్ మేనేజర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించాము. వేతనాలు పెంచాలని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని విభాగాల అధికారులకు విజ్ఞప్తి చేశాం. ఈ క్రమంలోనే డిసెంబర్ 13న అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సందర్భంగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమానికి సింగరేణి వ్యాప్తంగా అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు హాజరై జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.
ఈ సమావేశంలో తుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. సూర్యం,PSCWU రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే యాకూబ్ షావలి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ సతీష్, రాష్ట్ర కోశాధికారి పుల్లయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రశేఖర్, శరత్, వెంకన్న, కోయ్యడ శంకర్ మాట్ల సమ్మయ్య, పులిపాక రాజేందర్, ఎర్రల సారయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App