Earth Day : ధరిత్రిదినోత్సవం(ఎర్త్ డే) సందర్బంగా మొక్కలు నాటిన జనసేన కావలి నియోజకవర్గం ఇంచార్జ్ అలహరి సుధాకర్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 23 :నెల్లూరు జిల్లా: కావలి. జనసేన పార్టీ తరుపున కావలి నియోజకవర్గం లో ధరిత్రిదినోత్సవం(ఎర్త్ డే) సందర్బంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమములో భాగంగా జువ్వలదిన్నె పెదపట్టపు పాలెం, అనగారిపాలెం, సి .ఆర్ పాలెం పంచాయితీ ప్రాంగణము మరియు పాఠశాల ప్రాంగణములో మొక్కలు నాటే కార్యక్రమము జనసేన పార్టీ మత్స్యకార కమిటీ చేపట్టారు. ముఖ్య అతిధిగా జనసేన పార్టీ కావలి నియోజక వర్గ ఇంచార్గ్, అళహరి సుధాకర్ , పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని డి.యర్ తేజ, సౌజన్యముతో మరియు మత్స్యకార రాష్ట్ర కార్యదర్శి శ్రీను, మత్యకార అధ్యక్షులు డీఆర్.రవి పర్యవేక్షణలో మరియు మత్స్యకార కమిటీ సభ్యుల సహకారంతో జరిగింది అని, ఈ కార్యక్రమములో పాల్గొన్న జువ్వలదిన్నె సచివాలయ సెక్రటరీ సురేంద్ర మరియు సచివాలయ సిబ్బంది పాల్గొనందుకు వారికి అభినందనలు తెలుపుతు.
1969 లోనే ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ కోసం మొదలుపెడితే, ప్రపంచం అంతటా ఏప్రిల్ 22 , 1970 నుండి ఎర్త్ డే(ధరిత్రిదినోత్సవం) వార్షిక కార్యక్రమంగా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ ప్రకటించి అమలు చేస్తున్నారు అని తెలిపారు. మనకు తల్లి ధరిత్రిపై అనువైనచోట మొక్కలు నాటి, చుట్టూ ఉన్న పరిసరాలను కాలుష్యము నుండి కాపాడి, పుడమి తల్లి మనల్ని, మన భావితరాలను కాపాడే శక్తిని సంతరించుకునేలా చేద్దాం అని కోరారు. ఇది మన భద్రత అని తెలిపారు.
కాలుష్యము చేసే వారు ధరణి హంతకులు… ఆ హంతకులకు కొమ్ముకాస్తున్న అధికారులకు కూడా కారాగార శిక్షలు విధించాలి అని ఘాటుగా స్పందించారు. మన కావలి సముద్రతీరం వెంబడి కూడా మడ అడవులను నరికేసి ఆక్వా కల్చర్ కోసం గుంటలు తవ్వి సాగుచేస్తున్నారు. ఇది సముద్రము కోతకు మరియు మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తుంది అని ఈ విషయము మా అధ్యక్షులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,దృష్టికి కూడా తీసుకువెళ్తానని తెలిపారు. అధికారులు దీనిపైన తక్షణము చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలలో భాగమైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం,వైపు అడుగులు వేద్దాం అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమములో జనసేన పార్టీ మత్స్యకార నాయకులు, పంచాయతీ అధ్యక్షులు, వీర మహిళలు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena Kavali constituency in-charge

You cannot copy content of this page

Scroll to Top