Simultaneous loan waiver.. for the first time in the history of the country
- 70 లక్షల మంది రైతు లకు మేలు
- ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ. 31 వేల కోట్లు వెచ్చిస్తున్నాం
- టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
Trinethram News : ఏకకాలంలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ దేశ చరిత్రలోనే మొదటిసారి అని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీలో ప్రక్రియ ప్రారంభించి, ఇందులో భాగంగా గురువారం రూ.లక్ష రుణమాఫీ చేపట్టడం పై హర్షం వ్యక్తం చేస్తూ గాంధీభవన్లో నిర్వహించిన సంబరాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి తో పాటు మధుయాష్కీ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు తమ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.
రైతు డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు లేని విధంగా.. 70 లక్షల మంది రైతులకు రూ.31వేల కోట్ల రుణాలు మాఫీ అవుతుండడం రాష్ట్ర చరిత్రలోనే గొప్ప విషయం అన్నారు.
రైతులంతా సంతోషంతో పండగ చేసుకుంటున్నారని.. రుణమాఫీ ప్రారంభించిన జులై 18 రైతుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
కేంద్రంలో పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న మోడీ ప్రభుత్వం.. రైతులు అడిగిన కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా, రైతుల గొంతు నొక్కిందన్నారు.
రాష్ట్రంలో పదేళ్లు పాలించిన కేసీఆర్ ప్రభుత్వం.. రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేయలేక, ఇచ్చిన మాట నిలుపుకోలేక చేతులేత్తేశాడని విమర్శించారు.
తమ ప్రభుత్వం రుణమాఫీ ప్రారంభించటంతో.. కెసిఆర్, కేటీఆర్ , హరీష్ రావులకు తల తిరిగిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్లు దోపిడీ తప్పా.. కెసిఆర్ పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రం అప్పుల్లో ఉన్నా, ఆర్థిక వనరుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న.. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుందన్నారు.
ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలోని మాచారెడ్డిలో 20 ఏళ్ల క్రితం రైతుల ఆత్మహత్యలపై చలించి.. వారిని వ్యక్తిగతంగా ఆదుకున్నానని, రైతులకు మేలు చేకూర్చాలని తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు మధుయాష్కీగౌడ్ వివరించారు.
ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా రు. 74వేల కోట్ల రుణమాఫీ చేశామని, అదే స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ అంటేనే రైతుల సంక్షేమ ప్రభుత్వమని పునరుద్ఘాటించారు.
రుణమాఫీ సంబరాల్లో రాష్ట్ర రైతాంగమంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App