WhatsApp Image 2024 07 18 at 18.49.19
In celebration of the arranged farmer loan waiver
తొర్రురు మండలం మటెడు *గ్రామంలో రైతు వేదికలో
ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబరాల్లో
పాల్గొన్న యశస్విని ఝాన్సి రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి
పాలకుర్తి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
డీజే సప్పులతో, బాణసంచాలతో, ఎడ్ల బండ్ల ర్యాలీతో, రైతుల ఆనందకేరింతలతో, మటెడు గ్రామంలో అంబరానంటిన రైతు రుణమాఫీ సంబరాలు
రైతును రాజును చెయ్యడమే మా ప్రభుత్వ లక్ష్యం, లక్షల మంది రైతుల కండ్లల్లో ఆనందం చూస్తున్నాం
పేదల ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలుబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి
ప్రతిపక్ష పార్టీలు సైతం హర్షిస్తున్న
మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్దంగా ఉండండి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ద్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు, రైతులకు ప్రభుత్వం పై నమ్మకం కలిగే విదంగా వ్యవహరిస్తున్నాం అని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని తెలిపారు..
అర్హులైన రైతులందరికీ ఆగస్టు 15 వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని తెలిపారు, ప్రజాలతో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు, నేడు పాలకుర్తి నియోజకవర్గంలో 14,644 మంది లబ్ధిదారులకు 80, 65,68,872/- ఎనభై కోట్ల అరవై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెభై రెండు రూ రైతులకు రుణమాఫీ జరుగుతుంది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మరియు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు, అధికారులు, యువజన నాయకులు, సోషల్ మీడియా నాయకులు, మహిళ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
