సిద్దిపేట ప్రథమ స్థానంలో నిలవాలి:

TRINETHRAM NEWS

Trinethram News : సిద్దిపేట నియోజకవర్గం పదిలో ప్రథమ స్థానం లో నిలవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు.హరీష్‌ రావు

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్… ఈ పాఠశాల దినదిన అభివృద్ధి జరుగుతుందన్నారు. గతంలో ఈ పాఠశాల వర్షం వస్తే పెచ్చులు ఉడుతాయని బంద్ చేసేది, నేడు కార్పొరేట్ స్కూల్ నీ తలదన్నేలా ఉందన్నారు.

50లక్షల సిఎస్ఆర్ నిధులతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాం అని… త్వరలోనే ఈ పాఠశాలకు కంప్యూటర్ ఇన్స్తక్టర్ ను ఏర్పాటు చేస్తాం అన్నారు. రాబోయే కాలం మొత్తం కంప్యూటర్ కాలమే కావున విద్యార్థులు వీటిని వినియోగించుకోవాలని…కంప్యూటర్ పరిజ్ఞానం జీవన విధానం లో భాగమైందన్నారు. జిల్లాలో ఎక్కువ మంది ఆడపిల్లలు చదివే పాఠశాల ఇది అన్నారు.

ఈసారి ఈ పాఠశాల పదవ తరగతి లో వందశాతం పలితాలు సాధించాలని.. మీరు బాగా చదవండి భవిష్యత్ మీ చేతిలోనే ఉందన్నారు. మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ పదిలో 10 gpa, 100 శాతం మార్కులు సాధించాలన్నారు.

You cannot copy content of this page

Scroll to Top