Trinethram News : ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడింది. తన పుట్టిన రోజు సందర్భంగా చెవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్‌లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ బర్త్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు 50 మంది హాజరు కాగా అందులో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు హాజరయ్యారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీ జరుగుతున్న త్రిపుర రిసార్ట్‌పై చెవెళ్ల పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ రెయిడ్‌లో భారీగా విదేశీ మద్యాన్ని వారు సీజ్ చేశారు. 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా.. అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు పార్టీ నిర్వాహకులపై పోలీసులు NDPS యాక్ట్ కింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


