ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Shetti Appalu Birthday Wishes Botsa

​Shetti Appalu Birthday Wishes Botsa : అరకులోయ జులై 10, (త్రినేత్రం న్యూస్) : వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, శాసనమండలి ప్రతిపక్ష నేత డాక్టర్ బొత్స సత్యనారాయణ 68వ జన్మదిన వేడుకలు అరకులోయలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అరకు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి మాజీ సమన్వయకర్త మాజీ ఎంపీపీ, కార్తీకో అరుణ కుమారి,జిల్లా అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు ఆధ్వర్యంలో అరకులోయ మండలంకు చెందిన పార్టీ శ్రేణులు, నాయకులతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
​అనంతరం, అరకులోయ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు విజయనగరంలోని బొత్స సత్యనారాయణ స్వగృహానికి చేరుకుని, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులందరూ బొత్స సత్యనారాయణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో పేదలబుడు సెగ్మెంట్-2 ఎంపీటీసీ దురియా ఆనంద్ కుమార్, మాజీ సర్పంచ్ పూజారి అర్జున్, మాజీ సూపర్ సర్పంచ్ చిరంజీవి, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ బూర్జ హస్తిన కుమార్, పట్టాసి కొండలరావు, కొర్ర సాల్మన్ రాజు, కిల్లో బేసు, జన్ని మోహన్, జల్లెడ గన్ను, బాబురావు, శెట్టి సోమేష్, మోహన్ రావు,పంచాడి తిరుపతి, పాంగి ఆనందరావు, దురియా గోపాల్, ఎల్బి రామారావు,బోయి మోహన్,వంతల లైబన్ తదితర పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page