గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41 వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల అనిల్ కుమార్ కుమార్తె సాయి సుదీక్ష కు ప్రతినెల మొదటి వారంలో 2000 వేల రూపాయల ప్యాకెట్ మనీ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో అందజేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా శుక్రవారం రోజున గాంధీ నగర్ లోని సాయి సుదీక్ష తండ్రి గద్దల అనిల్ కుమార్ కు2000 వేల రూపాయల చెక్ ను అందజేసినట్లు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం సాయి సుదీక్ష సహాయం కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ఆనాడు నేను పోస్టు చుడడం జరిగిందని వెంటనే నేను స్పందించి సేవా స్పూర్తి ఫౌండేషన్ తరుపున విద్యార్థిని సాయి సుదీక్ష కు ప్యాకెట్ మణిగా ఎంబీబీస్ కోర్సు పూర్తి అయేంతవరకు ప్రతి నెల 2000 వేలు ఇస్తానని మాట ఇవ్వడం జరిగిందని ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి నెల మొదటి వారంలో విద్యార్థిని తండ్రి గద్దల అనిల్ కుమార్ అందిస్తున్నామని మడిపెల్లి మల్లేష్ తెలిపారు నేను స్తాపించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ లో సభ్యులుగా ఉన్న నా ఆత్మీయులందరి సహకారంతో గత 39 నెలల నుండి సాయి సుదీక్ష కు 2000 రూపాయల ప్యాకెట్ మని అందిస్తున్నామని ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులందరికి విద్యార్థిని తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


