కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : కరీంనగర్ జిల్లా : ఫిబ్రవరి 07
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కారు, టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లి, కూతురుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో కుమార్తె, కుమారుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు…

You cannot copy content of this page

Scroll to Top