జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 08 at 19.54.47

TRINETHRAM NEWS

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా నవంబర్ 08 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట గ్రామ శివారులో ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన చెంచు రమేష్,అతని స్నేహితుడి తో కలిసి అవసరం నిమిత్తం జమ్మికుంట వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్లే క్రమంలో జమ్మికుంట మండలం నాగంపేట గ్రామం వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న టాటా ఏసీ వాహనన్ని ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలైన చెంచు రమేష్ అనే యువకుడు సంఘటన స్థలంలోనే మృతిచెందగా..

అతని స్నేహితుడికి తీవ్ర గాయాలు కావడంతో అతనిని అంబులెన్స్ లో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page