
త్రినేత్రం న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి జిల్లా కోఆర్డినేటర్ లు ఎన్.సతీష్ కుమార్, ఎస్. కె. సైదులు యు.పి.ఎస్ మాదారం, ఎం.పీ.పీ.ఎస్ విజయపురి కాలనీ, ఎం.పీ.పీ.ఎస్ ములకలపల్లి పాఠశాలలను గురువారం సందర్శించి బాలికల టాయిలెట్స్ ఆవశ్యకతకు సంబంధించి పాఠశాల ఆవరణను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ సూచన మేరకు గర్ల్స్ టాయిలెట్స్ లేని పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన టాయిలెట్స్ నిర్మించేందుకు గాను ప్రణాళికను రూపొందించుటకు గాను సందర్శించినైనదని అన్నారు.
మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి, భోజనం టేస్ట్ చేయడం జరిగింది. మెనూ ప్రకారం నాణ్యత కలిగిన ఆహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందించాలని వంట ఏజెన్సీ వారికి మరియు ప్రధానోపాధ్యాయులకు సూచించినారు. అదేవిధంగా పాఠశాలలలోని స్పోర్ట్స్ కిట్ మరియు పాఠశాల శానిటేషన్ కిట్ లను ప్రత్యేకంగా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ లు యస్. కె. సైదులు, ఎన్. సతీష్ కుమార్, మండల విద్యాధికారి జి సత్యనారాయణ, కాంప్లెక్స్ హెచ్ఎం లతా, టీజీడబ్ల్యు ఐ డి సి ఏ.ఈ రాజగోపాల్, పాఠశాలల హెచ్ఎం, ఇతర పాఠశాల సహ ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
