సంఘ బలోపేతం కోసం కృషి చేయాలి’…గౌడ సంఘం అధ్యక్షుడు పరికల రాంబాబు గౌడ్
త్రినేత్రం న్యూస్. అశ్వారావుపేట, ఆగష్టు 18 (తెలంగాణం): ‘సంఘ బలోపేతం కోసం కృషి చేయాలి’ అని గౌడ సంఘం అధ్యక్షుడు పరికల రాంబాబు గౌడ్ అన్నారు..సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 జయంతి సందర్భంగా అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘం అధ్యక్షుడు పరికల రాంబాబు గౌడ్ జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం గ్రామంలో గౌడ కులస్తులు తో కలిసి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…
ఈ సందర్బంగా గౌడ సంఘం అధ్యక్షుడు పరికల రాంబాబు గౌడ్ మాట్లాడుతూ.. బహుజనులకు రాజ్యాధికార దిశగా మనమంతా పాటుపడాలని, సంఘ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని దారబోసిన మహాయోధుడు పాపన్న అని కొనియాడారు.నిరంకుశ పాలనకు ఎదురొడ్డి, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పాపన్న గౌడ్ తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమన్నారు. సామాజిక, రాజకీయ సమానత కోసం కృషి చేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న పోరాటస్ఫూర్తిని భావితరాలకు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం నాయకులు.. గోదా మల్లయ్య, జుజ్జూరి దుర్గారావు , పానుగంటి నాగ శ్రీనివాసరావు, పల్లెల రామ లక్ష్మయ్య , పల్లెల తరుణ్, జుజ్జూరు వెంకన్న బాబు , బొడ్డు సత్యనారాయణ, గడ్డం ఏసు, కోన మహేష్ , కొనకళ్ళ రత్నగిరి, పర్స రమేష్ , బుర్ర వెంకటేశ్వరరావు , పల్లెల రాంబాబు, కోన రోశయ్య, కొనకళ్ళ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


