Salaries should be Increased : అధిక ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి

TRINETHRAM NEWS

సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలపై జి జి హెచ్ స్పెషల్ ఆఫీసర్ స్పందించాలి…

త్రినేత్రం న్యూస్ కాకినాడ,నవంబర్,11: ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి అనుబంధ సంఘం, అధ్యక్షులు కె.వి.రామయ్య అధ్యక్షతన సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెంచాలని మంగళవారం ఉదయం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి మూడో గేటు వద్ద రెండవ రోజు నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా యూనియన్ గౌరవ అధ్యక్షులు తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం రోజురోజుకీ పెంచుతున్న నిత్యవసర అధిక ధరలకు అనుగుణంగా సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ ఒప్పందంలో భాగంగా 138 జీవో ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని ఆయన అన్నారు.

ఆస్పత్రి సూపరిండెండెంట్ సెక్యూరిటీ గార్డ్స్ ఇచ్చిన హామీలో భాగంగా ఎంవోయూ ఒప్పందంలో నియమ నిబంధనలు ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని, క్యాజువల్ లీవ్స్ అమలు చేయాలని, జాతీయ పండగ సెలవులు ఇవ్వాలని, మహిళల చీరలకు కుట్టుకూలీ మంజూరు చేయాలని ఆయన అన్నారు. చాలీచాలని జీతాలతో, పని ఒత్తిడి భారంతో పనిచేస్తున్నారని, సెక్యూరిటీ గార్డ్స్ శ్రమను దోచుకుంటున్నారని శ్రమకు తగ్గ ప్రతిఫలంగా దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి స్పెషల్ ఆఫీసర్ సెక్యూరిటీ గార్డ్ సమస్యలపై స్పందించాలని, కాంట్రాక్టర్, చే జీతాల పెంచేందుకు చొరవ చూపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్.అనిల్ కుమార్, ఎం. రాజేందర్రావు,డేగల మధు, పితాని రమణ, శ్రీవల్లి,మీరాభి, అప్పారావు,వెంకటేష్,లోవ కుమారి, కాటూరి రాజు, డేగల మధు, దుర్గామణి,అప్పన్న శ్రీనివాస్, శ్రీదేవి, ప్రశాంతి, రమేష్, పద్మావతి, లక్ష్మీ, పైడ్రాజు, రత్నం, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Salaries should be increased

You cannot copy content of this page

Scroll to Top