భర్త లేని నిరుపేద మహిళ బాత్రూం నిర్మాణనికి సహృదయ ఫౌండేషన్

TRINETHRAM NEWS

U. S. A మరియు నీడ చేయుత.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. విటల్ నగర్ కి చెందిన s.రమా భర్త 6 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఇద్దరు పిల్లలతో ఒక రూమ్ లో నివసిస్తుంది. పాత గోడలు కావడంతో ఇంటి ముందరి గోడ, బాత్రూం కూడా కూలిపోయినది. దీంతో ఆర్థిక పరిస్థితి బాగలేని వీరు నిర్మాణం చేపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వీరి పరిస్థితి కీ తెలిసినవాళ్లు ఇటుకలు అందించిన సిమెంటు బస్తాలకీ, లేబర్ చార్జీలకు డబ్బులు లేవు. విషయం తెలుసుకున్న నీడ అధ్యక్షలు పల్లెర్ల రమేష్ గౌడ్, సహృదయ ఫౌండేషన్ సా ఫౌండర్ బిందు తడివాక తెలపగా. ఒంటరి మహిళలు పడుతున్న బాధ తనకు తెలుసునని ఇలాంటి వారికి తప్పక సాయం చేస్తానని వారి బాత్రూం నిర్మాణానికి అవసరమైన సిమెంటు, పైపులు, లేబర్ చార్జీలు ఇస్తానని తెలిపారు.

దీంతో ఈరోజు విటల్ నగర్ లోని రమ ఇంటికి వెళ్లి నీడ ఆధ్వర్యంలో సహృదయ ఫౌండేషన్ సహకారం తో సిమెంటు బస్తాలు, లేబర్ లకు చార్జీలు అందించడం జరిగింది తొందరలో బాత్రూం నిర్మాణం, ఇంటి ముందర గోడ పూర్తి చేయాలని మేస్త్రీలను కోరడం జరిగింది. ఈ సందర్భంగా నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఎక్కడో ఉండి కూడా నిరుపేదలకు సాయం చేయడం అనేది బిందు తాడివాక చెల్లినదని ఇలాంటి మంచి మనసుకు ధన్యవాదములు తెలిపారు
ఈ కార్యక్రమంలో సామాజిక విద్యావేత్త సూర్యదేవర జ్యోతి, నసీమా భరోసా, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sahrudaya Foundation builds bathroom

You cannot copy content of this page

Scroll to Top