Sabarimala Temple Closed : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

TRINETHRAM NEWS

శబరిమల : కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర మంగళవారం ఉదయంతో ముగిసింది. సంప్రదాయబద్ధమైన పూజల అనంతరం ఉదయం 6:45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ)ప్రకటించింది.

ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేశారు. అంతకుముందు ఉదయం 5 గంటలకు గణపతి హోమంతో నిత్య పూజలు ప్రారంభమయ్యాయి.

ప్రధాన పూజారి,మేల్సాంతి ఈడీ ప్రసాద్ నంబూద్రి, అయ్యప్ప స్వామి విగ్రహా నికి విభూతి అభిషేకం నిర్వహించి, రుద్రాక్ష మాలతో అలంకరించారు. అనంతరం పవిత్రమైన ‘హరివరాసనం’ గానం తర్వాత గర్భగుడి తలుపులను మూసివేశారు.

ఆలయ తాళపు చెవులను రాజకుటుంబ ప్రతినిధికి అప్పగించగా, ఆయన వాటిని శబరిమల పరిపాలనా అధికారి ఎస్. శ్రీనివాసన్‌కు అందజేశారు. నెలవారీ ఖర్చుల కోసం ఉంచే డబ్బుల సంచిని కూడా ఇదే సమయంలో అప్పగించడం ఇక్కడి సంప్రదాయం.

ఇదే సమయంలో పవిత్ర తిరువాభరణాల తిరుగు ప్రయాణం కూడా 30 మంది సభ్యుల బృందంతో మొదలయ్యింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sabarimala Ayyappa Swamy Temple Closed

You cannot copy content of this page

Scroll to Top