రాజ్యాంగం లోని షెడ్యూల్ తొమ్మిదిలో బీసీ రిజర్వేషన్లను తక్షణమే చేర్చాలి
బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకై ఉద్యమాలే శరణ్యం
ఎం.సి.పి.ఐ.(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను నిరసిస్తూ ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళన
వరంగల్ జిల్లా. 10 అక్టోబర్ 2025 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి .. బీసీల జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంలో పాలక పార్టీలకు చిత్తశుద్ధి లేదని అందుకు ప్రత్యక్ష నిదర్శనమే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం అని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈరోజు ఎం.సి.పి.ఐ.(యు) ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడానికి నిరసిస్తూ వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 56% బీసీలు ఉంటే 42% రిజర్వేషన్లు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా జీవో 9 తీసుకువచ్చి పూర్తి చట్టబద్ధ లేకుండా స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి న్యాయస్థానంలో నిలబడకుండా చేసిందని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అగ్రవర్ణాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఉత్పత్తిలో కీలక భూమిక పోషించే బీసీలకు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్రవర్ణాలు అగ్రకులాలు చట్టసభలను శాసిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక తరగతులను అణిచివేస్తున్నారని వారికి అండగా పాలక పార్టీలు పనిచేస్తున్నాయని ఈ క్రమంలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆ కుట్రలో భాగంగానే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అంటూ కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఇలాంటి బీసీల జనాభా కనుగుణంగా రిజర్వేషన్ల సాధనకై రాజకీయాల కతీతంగా ఉద్యమించడమే ఏకైక శరణ్యమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో బీసీ రిజర్వేషన్లను చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలను సంవత్సరాల తరబడి వాయిదా వేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ స్థానికంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతమయ్యే విధంగా చేస్తున్నారని అందుకని తక్షణమే బిసి రిజర్వేషన్ల పై విధించిన హైకోర్టు స్టేను ఎత్తివేయించి స్థానిక ఎన్నికలను నిర్వహించే విధంగా తగిన చర్యలను చేపట్టాలని లేకపోతే ప్రజా ఆగ్రహానికి తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మాలోత్ సాగర్ జిల్లా నగర సహాయ కార్యదర్శులు నర్ర ప్రతాప్ సుంచు జగదీశ్వర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ముక్కెర రామస్వామి ఏరియా కార్యదర్శులు గణిపాక ఓదేలు ఐతమ్ నాగేష్ మహమ్మద్ మహబూబ్ పాషా జిల్లా నగర కమిటీ సభ్యులు మాలోత్ ప్రత్యూష ఎగ్గని మల్లికార్జున్ మాలి ప్రభాకర్ హైమద్ అప్పనపురి నర్సయ్య నలివెల రవి మంద అనిల్ రఘుపతి యాకయ్య తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


