Gaddam Prasad Kumar : పత్తి కొనుగోలులో నిబంధనలను తొలగించాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ . ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ..

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆద్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా మాత్రమే ఉంటుంది. రైతులకు మేలు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యేశం.

గత ఏడాది వరకు ఎకరాకు 11 క్వింటాల వరకు పత్తిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది దానిని 7 క్వింటాళ్ళకు తగ్గించారు. ఈ నిర్ణయం వలన పత్తి పండించే రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఎకరాకు 13 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.

అదేవిధంగా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 అనే సిస్టం తీసివేసి రైతులు ఏ మిల్లుకు అయినా తీసుకుని వెళ్ళి అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడంతో పత్తిలో తేమ శాతం పెరిగింది. సి సి ఐ నిబంధనలలో ప్రస్తుతం ఉన్న తేమశాతం నిబంధన 8 నుండి 12 ను తీసీవేసి 16 శాతం వరకు తేమ ఉన్నా రైతుల నుండి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

తెలంగాణ రాష్ట్రం నుండి ఎనిమిది మంది బిజెపి ఎంపీ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, మా విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుని మీరందరూ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పత్తి రైతులను కాపాడాలి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rules should be removed in the purchase of cotton.

You cannot copy content of this page

Scroll to Top