RSR College Day : అంబరానంటిన ఆర్ ఎస్ ఆర్ 18 వ కాలేజ్ డే

TRINETHRAM NEWS
RSR College Day

RSR College Day : త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 3: నెల్లూరు జిల్లా: కడనూతల.. బోగోలు మండలం కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం రోజు 18వ కాలేజ్ డే ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్స్ గా మాజీ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ, సహకార శాఖల మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి , మరియు జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీలో డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్ అండ్ ఆడిట్ (డి .ఏ .ఏ) గా పని చేస్తున్న ప్రొఫెసర్ బి. దుర్గా ప్రసాదు గారు పాల్గొన్నారు అని తెలిపారు.

అలాగే అతిథిగా కళాశాల కరస్పాండెంట్ కం చైర్మన్ , రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , కూడా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు కళాశాల అందజేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్, హాస్టల్ సౌకర్యాలు, లైబ్రరీ సౌకర్యాలు తెలియజేశారు. అనంతరం అతిధులు కాకాని గోవర్ధన్ రెడ్డి , మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తాను ఇష్టపడిన ఏరియా మీద కేంద్రీకరించి మంచి ఫలితాలను సాధించాలని అలాగే పెద్దలైన తల్లిదండ్రులు గాని అధ్యాపకుల ద్వారా గాని కనీసం మీ మంచి మిత్రులు నుంచి నీకు అవసరమైన కౌన్సిలింగ్ తీసుకుంటూ చదువులలో రాణించాలని, అలాగే ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి మీ తల్లిదండ్రులకు, మీరు చదివిన కళాశాలకు, మీ అధ్యాపకులకు మంచి గుర్తింపు తేవాలని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు.

అలాగే ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న చెడు వ్యసనాల జోలికి ఎట్టి పరిస్థితుల్లో పోకుండా మీ జీవితాలను కాపాడుకోవాలని అలాగే మంచి సక్సెస్ స్టోరీలను చదువుకుంటూ, ఇన్స్పైర్ అవుతూ సమాజ సేవ చేయాలని, మంచి యువకులుగా తయారు కావాలని విద్యార్థులను కొనియాడారు. అనంతరం రెండవ ముఖ్య అతిథి అయిన ఆచార్య దుర్గాప్రసాద్ , మాట్లాడుతూ ప్రస్తుత విద్యా వ్యవస్థలో గల ఉద్యోగ అవకాశాలు, ప్రస్తుతం వస్తున్న మార్పులు, వాటికి అనుగుణంగా విద్యార్థిని విద్యార్థులు నేర్చుకోవాల్సిన నూతన కోర్సులు గురించి, ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేశారు. అలాగే క్రమశిక్షణతో నిబద్ధతతో కూడిన విద్య విద్యార్థులను ఉన్నత స్థానాలను అధిరోహించడానికి దోహదపడుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముందుగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ కే. రాజారెడ్డి , మరియు ప్రిన్సిపల్ , మాట్లాడుతూ కళాశాల ప్రస్తుత విద్యా సంవత్సరంలో అందించిన అక్కడమిక్ రిపోర్ట్ తో పాటు నిర్వహించిన ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇతర కార్యక్రమాలను సభకు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు చదివి వినిపించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో ఆర్వి రమణారెడ్డి, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top