Rs. 2 lakh loan waiver for the first time in the history of the country: CM Revanth Reddy
Trinethram News : Telangana
- టిపిసిసి కార్యవర్గ సమావేశానికి సీఎం, మంత్రులతో కలిసి హాజరైన మధుయాష్కి గౌడ్
ఈరోజు మధ్యాహ్నం ప్రజా భవన్ లో జరిగిన టిపిసిసి కార్యవర్గ సమావేశానికి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు హాజరు కాగా.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రులు , ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మార్గ నిర్దేశం చేశారు.
మరీ ముఖ్యంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ మన ప్రభుత్వం చేస్తుండడం.. దేశ చరిత్రలోనే మొదటిసారి అన్నారు. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. జాతీయస్థాయిలోనూ విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా.. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు మెరుగవుతాయి అన్నారు. ఈనెల 18 నుంచి 21 వరకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలలో రైతు రుణమాఫీపై సమావేశాలు సభలు నిర్వహించి ప్రభుత్వ గొప్పతనాన్ని వివరించాలని మార్గ నిర్దేశం చేశారు. అంతేకాకుండా ఇతర సంక్షేమ పథకాలు అన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App