WhatsApp Image 2024 01 17 at 8.20.03 PM
Trinethram News : శ్రీకాకుళం
ఓటర్ల జాబితా జిల్లా ప్రత్యేక పరిశీలకులు, సీనియర్ ఐఏఎస్ జె శ్యామలరావు రేపు జిల్లాకు రానున్నారని ఇన్చార్జి కలెక్టర్ ఎం నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు.
గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆయన జిల్లాలోని ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారని అన్నారు.
ఈనెల 22న వెలువడనున్న తుది ఓటర్ల జాబితా కి సంబంధించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడతారని పేర్కొన్నారు.
