కేశోరం ఫ్యాక్టరీ కార్మికులకురోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ అవగాహన సదస్సు
స్వీయ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్
బసంత్ నగర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ ప్లాంట్ ఆవరణ లో ట్రాఫిక్ రూల్స్, రాష్ డ్రైవింగ్, త్రీబుల్ రైడింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్, వాహన ధ్రువీకరణ పత్రాల ఉపయోగం పై అవగాహనా కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఎంప్లాయి విధిగా ఇంటి నుండి బయటకు వెళ్తున్నారంటే హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని డ్యూటీ సమయం కంటే ముందుగానే బయలుదేరాలని, తొందరపాటు తో అతి వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి స్వియ రక్షణ ముఖ్యం అని కావున ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అని సూచించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అదేవిధంగా తమ వెహికల్ కి ఇన్సూరెన్స్ తీసుకొని ఉండాలి.
మద్యం సేవించి వాహనాలు నడపరాదు మరియు అతివేగంగా అజాగ్రత్తగా సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదు. ఫోర్ వీల్ వాహనాలు నడిపినప్పుడు అందరూ సీట్ బెల్ట్ ధరించి ఉండాలి. ప్రతి ఒక్కరూ కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యతగా ఉండి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించాలి మన నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి అని తెలిపారు. సెక్యూరిటీ ఇంచార్జ్ రవీందర్ రెడ్డి లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App