MLA Satyananda Rao : ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి అన్ని విధాల కృషి

TRINETHRAM NEWS

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు….

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. 2.5 ఎకరాల కళాశాల ప్రాంగణం చుట్టూ రూ.8 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం నిమిత్తం శనివారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరియు జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. కళాశాల పాత భవనం పూర్తిగా తొలగించి ఆ ప్రదేశంలో నూతన భవనం నిర్మించేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాన్ని ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు అయ్యేలా చూడాలని కోరినట్లు తెలిపారు. కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

development of Government Junior College

You cannot copy content of this page

Scroll to Top