Review Meeting : ఉపాధి హామీ క్షేత్ర సహాయక సిబ్బందితో సమీక్ష సమావేశం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలంలో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని ఎంపీడీవో నీలకంఠేశ్వర్ రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ మీటింగ్ హాల్లో ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని అన్ని పంచాయతీల క్షేత్ర సహాయకులు కూలీలoదరికీ పనులు కల్పించాలని తెలిపారు.

గ్రామాల్లో కూలీల సంఖ్య పెంచాలని, కంపోస్ట్ బిట్లు పూర్తి చేయాలని అన్నారు. అలాగే రైతులకు మునగ సాగుపై అవగాహన కల్పించి మునగ పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. ఉపాధి పనులు వేగవంతానికి అందరూ సహకరించి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డ్వామా ఏపిడి ధనలక్ష్మి, ఉపాధి హామీ ఏపీఓ గుణ శేఖర్, డి ఏ లు, జేఈలు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Review meeting with the employment guarantee

You cannot copy content of this page

Scroll to Top