Revanth Reddy’s administration is trying to hurt Telangana sentiments by erecting Rajiv Gandhi’s statue to get the approval of Delhi elders
రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపెల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరు కంటి చందర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అని
తెలంగాణ ప్రజల సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగుతోందని రామగుండం మాజీ శాసనసభ్యులు
లపెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం గోదావరిఖని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమని ఆర్టికల్-3 ద్వారా తెలంగాణ రాష్ట్రంఏర్పాటు
జరిగిందని, ఆర్టికల్ 3ని రూపొందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరవీరుల కోసం అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఎన్నికల కోడ్ కారణంగా విగ్రహం పనులను ప్రారంభం చేయలేదన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్రంతో గాని తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహ స్థలంలో ఏర్పాటు చేయడం సరైంది కాదని అన్నారు. తెలంగాణ సెంటిమెంటుతో తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచిన ఏ నాయకుడు నిలువలేదని రాబోయే కాలంలో ప్రజలు రేవంత్ రెడ్డి కి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
ఈ విలేఖరుల సమావేశం లో కార్పోరేటర్లు పెంట రాజేష్ పాముకుంట్ల భాస్కర్ బాదె అంజలి గాధం విజయ కల్వచర్ల కృష్ణ వేణీ ఎన్.వి.రమణ రెడ్డి నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు పి.టి. స్వామి అచ్చే వేణు బోడ్డు రవీందర్ చల్లగురుగుల మెగిళి పిల్లి రమేష్ చెలకలపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి ఇంజపురి నవీన్ జక్కుల తిరుపతి తోకల రమేష్ సట్టు శ్రీనివాస్ యాసర్ల తిమెాతి రామరాజు వడ్లూరి రాములు రాజేష్ మహేందర్ రమ్య యాదవ్ ముద్దసాని సంధ్యా రెడ్డి ఆవునూరి వెంకటేష్ తిరుమల గుర్రం పద్మ అరె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App