ఫార్మాసిటీ కంపెనీ వెనక్కి తీసుకున్నా రేవంత్ రెడ్డి సర్కార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సంఘటిత,వీరోచిత,పోరాటనికి బయపడి,పార్మ సిటీ ని రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తీసుకుందని, BRS పార్టీ సీనియర్ నాయకులు, BRTU జిల్లా అధ్యక్షులు, టైగర్.భూమొల్ల.కృష్ణయ్య అన్నారు. లగచెర్ల లో మూడు పంటలు పండే పచ్చని పొలాల్లో విషాన్ని ఛిమ్మే రసాయన కంపని నీ, రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిందని, ఈ నిర్ణ యాన్ని లగచేర్ల రెైతులు, వారికి మద్దతుగా BRS పార్టీ పోరాటాము చేసిందని వారికి మద్దతుగా BRS పార్టీ నాయకులు నిలబడ్డారని, గుర్తు చేశారు. జిల్లా పోలిస్ అధికారులు, సిఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఒంటెడ్డు పోకడలు పోయి , తప్పుడు కేసులు బనాయించి , విచారణ చేయకుండానే , రైతులను అన్యయంగా జైళ్ళకు పంపిందని గుర్తు చేశారు. రెైతులు పార్మా సిటి కి భూములు ఇవ్వమని మొదటినుండే చెపుతున్న వినకుండా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా పేదల భూములు లాక్కోవాలని చూసిందని, తమ భూములను వదులుకోవడానికి ఇష్ట పడని రెైతులు, అధికారులపై, ప్రభుత్వం పై, తిరగ బడ్డారని గుర్తు చేశారు. ఆడవాళ్ళని చూడకుండా ,రేవంత్ ప్రభుత్వం అర్ధరాత్రి. విద్యుత్తు తొలగించి గిరిజన మహిళల పై పాశవికంగా దాడులు చేశారని అగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ మాజీ ఎంఎల్ఏ పట్నం .నరేందర్ రెడ్డి పై పెట్టిన 3 అక్రమా కేస్ లో రోండిoటిని తెలంగాణ హై కోర్టు కొట్టివేసినసంగతిగుర్తపెట్టుకోవలన్నరు. ఒక్క సంవత్సరం లోనే రెవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకుందని అన్నారు. రాబోవు రోజుల్లో ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు. లగచర్ల భూముల్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీస్కోగూడదని నిర్ణయం చేయడం శుభ పరిణామమని , ఇది లగచర్ల రైతుల సంఘటిత పోరాట పలమే ,BRS పార్టీ నేతలుపోరాట పలితమేననీ గుర్తు చేశారు. ఇప్పటికైనా. కాంగ్రెస్ ప్రభుత్వాం , సిఎం రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App