తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన రేవంత్ సర్కారు

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ మార్చి 09
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఇటీవల హైదరా బాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023- 24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కా రాలు అందజేశారు.

అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారా నికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

హామీ ఇచ్చిన రెండ్రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టు కోవడంతో ఆర్టీసీ ఉద్యోగు లకు హర్షం వ్యక్తం చేస్తున్నారు…

You cannot copy content of this page

Scroll to Top