
Resolve Drinking Water Issues : దేవరకొండ డివిజన్ జులై 20, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రాష్ట్ర మంత్రులను కోరారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పెండ్లిపాకల 7 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్మెంట్ ఎల్ప్లాంట్ వద్ద ఇటీవల మరమ్మత్తులు చేసిన 33/415 ట్రాన్స్‌ఫార్మర్‌కు అదనంగా మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, బాట్లపల్లి పంప్‌హౌస్‌లో అదనపు మోటార్‌ను ఏర్పాటు చేయాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే డిండి ప్రాజెక్టు నుంచి ఇప్పటికే సాగునీటిని విడుదల చేసినందున, ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు ఉన్న నేపథ్యంలో వానాకాలం పంటలకు ఆటంకం లేకుండా సాగునీరు అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కోరారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించి, రైతులకు నిరంతరాయంగా సాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ పంటల ఎంపిక చేసుకుంటే రైతులు నష్టాలను తగ్గించుకోవచ్చని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు నిరంతరాయంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe