State Affiliated Committees : రాష్ట్ర అనుబంధ కమిటి లలో జిల్లాకు ప్రాతినిధ్యం

TRINETHRAM NEWS

Representation of the District in the State Affiliated Committees

Trinethram News : తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియుడబ్ల్యూజె, ఐజేయు) రాష్ట్ర ప్రధాన కమిటీకి అనుబంధం కమిటీలను నియమించారు.
మల్కాజిగిరి నియోజకవర్గం కు చెందిన ఎన్.బాలరాజు (విశాలాంధ్ర ) రాష్ట్ర మాఫీసల్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా నియమితులైయ్యారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ (518/23) సభ్యులు బాలరాజును గురువారం శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర మాఫీసల్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా నియమించినందుకు యూనియన్ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు గోన సన్నెల్ రెడ్డి, మోహన్ రావు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వై.విశాల్ యాదవ్, కోశాధికారి రెహమాన్, గౌరవ అధ్యక్షులు రవి కుమార్ యాదవ్ ,లవకుమార్, శివ కుమార్, సంగమేశ్వర్, రాజేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, పవన్, మహేందర్ యాదవ్, సుబ్బారావు, కుమ్మరి రాజు, సత్యం, నాగరాజు, ప్రభాకర్, శివ యాదవ్, సంతోష్, జాన్, మహేందర్, దుర్గాప్రసాద్, జ్యోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top