Trinethram News : ఢిల్లీ: వాక్ స్వాతంత్రన్ని రక్షించాలన్న సుప్రీం .. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి .. నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా .. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము కూడా నవ్వుతుంటామన్న సుప్రీం .. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి .. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుంది
శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ .. విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ..
పిటిషన్ లోని ముఖ్యాంశాలు: కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారు .. మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి .. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారు .. సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదు
కేఎస్సార్ లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు .. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్ ను యాంకర్ కేఎస్ఆర్ నియంత్రించారు … వాటిని సమర్థించలేదు .. తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్లో రిమాండ్ చేశారు .. ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదు
కొమ్మినేని సీనియర్ జర్నలిస్టు ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు.. 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్ .. కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదు .. స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించలేదు … సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం .. ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారు .. ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు .. వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు .. అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


