
గంటల వ్యవధిలోనే రెండో ఘటన.. కొత్త పాంబన్ వంతెనపై కలకలం!
Woman Jumps from Moving Train : త్రినేత్రం న్యూస్ : తమిళనాడులోని కొత్త పాంబన్ రైల్వే వంతెనపై వరుసగా రెండు ఆందోళనకర ఘటనలు చోటుచేసుకున్నాయి. కదులుతున్న రైళ్ల నుంచి ఇద్దరు ప్రయాణికులు సముద్రంలోకి దూకడం కలకలం రేపింది. శనివారం రాత్రి రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు సముద్రంలోకి దూకగా, ఆదివారం ముల్లిమునై దీవి సమీపంలో అతడి మృతదేహం లభ్యమైంది.
మరోవైపు ఆదివారం ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైలు నుంచి సముద్రంలోకి దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిన ఈ రెండు ఘటనలు ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe