
Reddy Garjana Honored : డిండి (గుండ్ల పల్లి) మార్చి 17 ,త్రినేత్రం న్యూస్. రెడ్డి గర్జన గుర్రం పాపిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులోని బ్రాహ్మణపల్లి పరిణయ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో భాగంగా డిండి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి, అచ్చంపేట నియోజకవర్గ రెడ్డి సేవా సమితి అధ్యక్షులు కసిరెడ్డి రామకృష్ణారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ గెజిటెడ్ హెడ్మాస్టర్ ఎం భగవంతు రెడ్డి లను , రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి ,గుర్రం పాపిరెడ్డి చేతుల మీదగా ఘనంగా సన్మానించబడ్డారు. లక్ష్మారెడ్డి పశుసంవర్ధక శాఖలో రాష్ట్ర సంచాలకులుగా సేవలందించి ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అనేక అవార్డులు పొందారు.
అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గం లో పలు రాజకీయ పదవులను చేపట్టి సేవా కార్యక్రమాలు అందించి, ప్రస్తుతము అచ్చంపేట రెడ్డి సేవా సమితి అధ్యక్షులుగా సేవలందిస్తున్న కసిరెడ్డి రామకృష్ణారెడ్డి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన హెడ్మాస్టర్ భగవంతు రెడ్డి లను ఉగాది పురస్కారాల లో భాగంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి ,బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి ,జాతీయ ఓసీ సంఘం అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి శ్యామలారెడ్డి, వెంకటరెడ్డి, లక్ష్మిరెడ్డి, ఎల్చాల పురుషోత్తం రెడ్డి, భగవంతు రెడ్డి ,బద్దం నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి ,బొక్క భూపాల్ రెడ్డి ,లింగారెడ్డి, దశమంత రెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

