కడియం, త్రినేత్రం న్యూస్. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామ సచివాలయంలో ప్రభుత్వ జాతీయ విపత్తుల శాఖ ఆధ్వర్యంలో ఆధునిక రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమంగా ఈ గ్రామంలోనే ఈ సిస్టమ్ అమలు చేయడం విశేషం.
ఈ వ్యవస్థ ద్వారా జాతీయ విపత్తులకు సంబంధించిన హెచ్చరికలు 360 డిగ్రీల హార్న్ స్పీకర్ల ద్వారా కిలోమీటర్ పరిధిలోని ప్రజలకు రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ రూపంలో అందజేయబడతాయి. వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, తుఫానులు, వర్షాలు వంటి పరిస్థితులపై ఈ సిస్టమ్ వాయిస్ అలర్ట్స్ మరియు సైరన్‌ల రూపంలో హెచ్చరికలు ఇస్తుంది. ముఖ్యంగా, ఈ పరికరం కరెంట్ అవసరం లేకుండా పనిచేసే విధంగా రూపుదిద్దుకోవడం దీని ప్రత్యేకత.
ప్రస్తుతం ‘మొందా’ తుపాను నేపథ్యంలో ఈ వ్యవస్థ గ్రామ ప్రజలకు గంట గంటకు వాతావరణ సమాచారం అందజేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి IAS కి గ్రామస్థుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ సిస్టమ్ గ్రామ ప్రజలకు విపత్తుల సమయంలో అప్రమత్తతను కలిగిస్తూ ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో మైలురాయిగా నిలుస్తుంది అని సర్పంచ్ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


