Ramagundam Corporation 48th Division Maruti Nagar Colony to resolve the issues expeditiously
ఆ డివిజన్ ప్రజల కార్పొరేషన్ అధికారులను కోరారు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు స్థానిక 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీలావతి ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలు సమస్యలపై గళమెత్తారు.. ఈ సందర్భంగా నీలావతి తోపాటు డివిజన్ మహిళలు మాట్లాడుతూ తమ డివిజన్ లో BRS ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి రోడ్లు, వీది దీపాలు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పెడచెవిన పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆయన్ సతీమణి మానాలి ఠాకూర్ తమ డివిజన్ ను సందర్శించి త్వరలోనే రోడ్ల సమస్య, వీది దీపాల సమస్యను పరిష్కరిస్తామని తెలుపడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే, మేయర్ తన డివిజన్ లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ కాలనీ లో ఎవ్వరైనా అనారోగ్యానికి గురైతే అంబులెన్స్ కూడా రాని పరిస్థితి ఉండాన్నారు. పారిశుధ్య విభాగం కూడా సరిగా పనిచేయకపోవడంతో కాలనీ కంపుకొడుతుందని తెలిపారు. కార్పొరేషన్ అధికారులు తన కాలనీ సమస్యలను త్వతిగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో మారుతి నగర్ కాలనీ వాసులు శశిరేఖ, మల్లమ్మ, పద్మ,కోటయ్య,మొండక్క,కుమార్,సత్తయ్య,విద్యావతి,శారద,సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App