రామగుండం పోలీస్ కమీషనరెట్

TRINETHRAM NEWS

రామగుండం పోలీస్ కమీషనరెట్

Trinethram News : తేది :11-12-2024

 14న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి.

 లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాల కక్షీదారులు అంగీకారయోగ్యమైన సత్వర పరిష్కారం పొందవచ్చు.

 రాజీమార్గమే రాజామార్గం : పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,

రాజీమార్గం రాజమార్గమని, కక్షలు, కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షీదారులు అంగీకారం తో సత్వర పరిష్కారం పొందవచ్చు అని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అన్నారు. ఈ మేరకు ఈరోజు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 14వ తేదీన జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండ బుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులో, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. రాజీ మార్గం రాజ మార్గ మని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్లు, పోలీస్ సిబ్బంది రాజీపడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top