WhatsApp Image 2024 08 22 at 6.46.28 PM
Ramagundam Police Commissionerate
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండము పోలీస్ఈ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో వాటర్ ట్యాంక్ ఏరియా మంచిర్యాల కు చెందిన హరిదాస్ సాయికృష్ణ, వ,, 29 సం,, అను వ్యక్తి ఏసీసీ ఏరియా సమీపంలో రైలు పట్టాలపై ఆత్మహత్యయత్నం చేసుకొనుటకు పడుకోనివున్నాడు అను సమాచారం మంచిర్యాల బ్లూకొల్ట్ కానిస్టేబుల్స్ అయిన సత్యనారాయణ మరియు రాజకుమార్ లకు డయల్ 100 కాల్ రాగా వెంటనే స్పందించిన బ్లూక్లోట్ కానిస్టేబుల్స్ సంఘటన స్థలానికి వెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని సకాలంలో కాపాడి, పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తికి అతని కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి అతనిని ప్రభుత్వ ఆసుపత్రి నందు డీ-అడిక్షన్ సెంటర్ కు పంపనైనది. సకాలంలో స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన సదరు బ్లూకొల్ట్ కానిస్టేబుల్స్ లను అభినందించి వారికీ రివార్డ్ అందచేయడం జరిగినది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
