TRINETHRAM NEWS

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను ఆకస్మికంగా అర్ధరాత్రి తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమీషనర్
రామగుండం మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని ప్రాంతం యందు రాష్ట్రంలో నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ వచ్చి నివసిస్తూ సింగరేణిలో ఫర్టిలైజర్ లో ఎన్టిపిసి పవర్ ప్లాంట్ యందు పనిచేస్తూ జీవిస్తారు ఇక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉంటారు కాబట్టి వారి యొక్క జీవనశైలి అనేది వేరువేరుగా ప్రత్యేకంగా కొనసాగుతూ ఉంటుంది అంతేకాకుండా వేర్వేరు రాష్ట్రాలు ఒడిశా బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ చతిస్గడ్ మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తూ ఉంటారు.

ఇలాంటి ప్రదేశంలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి రామగుండం పోలీస్ కమీషనర్ అంబటి కిషోర్ ఝా ఐపీఎస్ డిఐజి రాత్రి సమయంలో సుమారు 12 గంటల సమయంలో అర్ధరాత్రి సిబ్బందితో యుక్తంగా సంజయ్ గాంధీ నగర్ రైల్వే ట్రాక్, సేవన్ ఎల్ పి, 5 ఇంక్లైన్ ఏరియా సి ఎస్ పి ఏరియాలను ఆకస్మికంగా తనిఖీ చేసి చెక్ చేయడం జరిగింది ఈ ప్రదేశాలలో బొగ్గును అక్రమంగా తీసుకోవడం గంజాయిని సేవించడం దొంగిలించడం ఇనుప వస్తువులను సింగరేణి సంబంధించిన వాటిని దొంగిలించడం లాంటి చేస్తూ ఉంటారు అలాంటి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడం కోసం సిపి డీసీపీ పెద్దపల్లి గోదావరిఖని ఏసిపి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.

స్వయంగా తిరిగి ఇక్కడ ప్రాంతాల గురించి అడిగి తెలుసుకుని ఇక్కడ జరిగే చట్టావ్యతిరేకమైన చర్యల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించినైనది సిపి రామగుండం వెంట పెద్దపల్లి డిసిపి పి కరుణాకర్ గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్ సిఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ లింగమూర్తి గోదావరిఖని సబ్ డివిజన్ ఎస్ఐలు మరియు సిబ్బంది స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

surprise midnight inspection